Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా కథాంశం ఇదేనా!

Buzz about Ramchan and Buchi Babu sana movie
Advertisement
  • సెప్టెంబర్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశం
  • 'ఉప్పెన'తో భారీ విజయం అందుకున్న బుచ్చిబాబు
  • ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చరణ్
Advertisement
తొలిసినిమా 'ఉప్పెన'తో దర్శకుడు బుబ్చిబాబు సాన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం భారీగా వసూళ్లు కూడా రాబట్టింది. దీంతో బుచ్చిబాబు తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన రెండో సినిమానే ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ తేజ్ తో చేసే అదృష్టం బుచ్చిబాబును వరించింది. ప్రస్తుతం చరణ్.. అగ్ర దర్శకుడు శంకర్ తో ‘గేమ్ ఛేంజర్’ అనే ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత బుబ్చిబాబు దర్శకత్వంలో  సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం గురించి రోజుకో వార్త వస్తోంది. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అని ప్రచారం జరిగింది. 

ఇప్పుడేమో తిరుగుబాటు, ప్రతీకారం చూట్టు సాగే కథ అంటూ సోషల్ మీడియోలో హైప్ క్రియేట్ అయింది. ‘కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అవుతుంది’ అనే క్యాప్షన్ తో ఓ పోస్టర్ చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ రివోల్ట్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.  తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలోనే మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని తెలుస్తోంది.
Advertisement
Advertisement
Ramcharan
buchibabu
uppena
new movie

More Telugu News